Site icon TeluguMirchi.com

ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త ను చంపడానికి ప్లాన్..

ఈ మధ్య కట్టుకున్న భర్త కంటే..ఉంచుకున్న ప్రియుడే ఎక్కువై పోతున్నాడు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్త ను చంపుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు పలు చోటుచేసుకోగా..తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఇదే తరహా ఘటన జరిగింది.

రాజమండ్రిలోని సుబ్బారావుపేటకు చెందిన ప్రసాద్ కు కొన్నేళ్ల క్రితం అంబిక అనే మహిళతో వివాహమైంది. కానీ అంబికకు లింగంపేటకు చెందిన చక్రిదొర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఐతే ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అంబిక అతడ్ని ఎలాగైనా చంపేయాలని స్కెచ్ వేసింది. ప్రసాద్ తోడల్లుడైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అంబిక సంప్రదించింది. శ్రీకాంత్ కు ప్రసాద్ కు గతంలోనే గొడవలుండటంతో హత్యకు అతడు కూడా అంగీకరించాడు. జూన్ 30న శ్రీకాంత్.. ప్రసాద్ ను తీసుకొని మారేడుమిల్లి వెళ్లాడు. అక్కడ ప్రసాద్ కు మద్యం తాగించిన శ్రీకాంత్ బండరాయితో కొట్టి హత్య చేశాడు.

Exit mobile version