మహబూబాద్ జిల్లా నందివాడ శివారు గత గూడెం గ్రామంలో కన్న తండ్రే తన ఇద్దరు పిల్ల పిల్లలను బావిలో పడ్డ వేసిన ఘటన చోటుచేసుకుంది. మహబూబాద్ జిల్లా నడివాడ గ్రామ శివారూ గడ్డి గూడెం తండాకు చెందిన రామ్ కుమార్ ముంబై లో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు, గత కొన్ని రోజుల క్రితం స్వగ్రామమైన గడ్డి గూడెం తండా కు వచ్చాడు. నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తన ద్విచక్ర వాహనం పై సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇద్దరు పిల్లల్ని(కూతురు అమ్మి జాక్సన్ 8 సంవత్సరాలు, కుమారుడు జానిబేస్టో 6 సంవత్సరాలు) తీసుకొని తన వ్యవసాయ బావి లో పడేసి పరారయ్యాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి రామ్ కుమార్ ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటనతో తండా లో విషాదఛాయలు అంటుకున్నాయి