Site icon TeluguMirchi.com

పెళ్లి చేసుకోవడం లేదని కన్న కూతుర్ని చంపిన తండ్రి

ఏ తండ్రికైనా కన్న కూతురికి మంచి అబ్బాయి ని చూసి పెళ్లి చేయాలనీ మనవాళ్ళు , మానవరాళ్లతో సంతోషం గా గడపాలనే కోరిక ఉంటుంది. అయితే ఇక్కడ ఓ తండ్రికి మాత్రం ఆ కోరిక తీరడం లేదు. 30 ఏళ్లు వచ్చిన కూతురు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదని కోపంతో కన్న కూతుర్ని చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని ఝారై అనే గ్రామానికి చెదిన ఆశోక్ వైశ్ (69) కూతురు అంకు వైశ్ (30) భోపాల్‌లోని ఓ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటోంది. పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరిగిన అంకు వైశ్ మాత్రం అంగీకరించడం లేదు. ఇదే విషయంలో ఇంట్లో తరచూ వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఈ వాగ్వాదం తారస్థాయికి చేరింది. తన మాటకు కూతురు ఎదురు చెప్పడాన్ని సహించలేకపోయిన అశోక్ వైశ్.. బెడ్ రూమ్ లో ఉన్న పిస్టల్ తీసుకొచ్చి కూతుర్ని కాల్చేశాడు.

Exit mobile version