Site icon TeluguMirchi.com

డేరాబాబాకి జీవితఖైదు విధించిన సీబీఐ కోర్టు

డేరా సచ్చా సౌదా నిర్వాహకుడు, వివాదాస్పద మతగురువు గుర్మీత్‌ రామ్‌ రహీం బాబాకు జీవితఖైదు పడింది. తన ఆశ్రమంలో మేనేజర్ గా పనిచేసిన రంజిత్ సింగ్ హత్య కేసులో ఇవాళ పంచకులలోని సీబీఐ కోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. ఈ హత్యకేసుతో సంబంధమున్న మరో నలుగురు నిందితులకు కూడా జీవితఖైదు విధించింది. డేరాబాబాకి జీవితఖైదుతోపాటు 31 లక్షలు, మిగతావారికీ 50 వెలచొప్పున జరిమానా విధించింది. జరిమానా సొమ్ములో 50 శాతం బాధిత కుటుంబానికి అందచేయనున్నట్లు కోర్ట్ తెలిపింది.

Exit mobile version