Site icon TeluguMirchi.com

తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రిమినల్స్‌ కోసం సిబిఐ సోదాలు


తెలుగు రాష్ట్రాల్లో సైబర్ క్రిమినల్స్‌పై సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. సైబర్ నేరస్థులను పట్టుకోవడానికి సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ, హైదరాబాద్, విశాఖపట్నం సహా పూణే, అహ్మదాబాద్ వంటి నగరాల్లో దాడులు చేసింది. హైదరాబాద్‌లో ఐదుగురు, విశాఖపట్నంలో 11 మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేసింది. ప్రస్తుతం 170 మంది సైబర్ నేరస్థులను గాలిస్తున్నట్లు సీబీఐ వెల్లడించింది.

విశాఖపట్నంలోని విసి ఇన్ఫ్రా మ్యాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అత్రియా గ్లోబల్ సర్వీసెస్, హైదరాబాద్‌లోని వీఏజెక్ సొల్యూషన్స్ లాంటి సంస్థల్లో సీబీఐ సోదాలు జరుపుతుంది. ఈ సైబర్ నేరగాళ్లు అమెరికా, కెనడాలో ఉన్న ప్రజలను టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆపరేషన్ చక్ర భాగంగా ఇంటర్‌పోల్ అందించిన సమాచారం మేరకు నాలుగు ప్రధాన నగరాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సీబీఐ పెద్ద ఎత్తున నగదు, ఎలక్ట్రానిక్ డివైసులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అనేక బ్యాంకు ఖాతాల సమాచారాన్ని కూడా జప్తు చేసింది.

Exit mobile version