Srikanth Reddy

4434 POSTS

Exclusive articles:

‘ నెల ‘ సన్‌ షిండే లా….

వస్తుందో రాదో మరి తెలంగాణ ఇప్పట్లో! వణుకుతోంది స్టేటంతా ఉద్వేగపు దుప్పట్లో!! నెలరోజులు గడువుపెట్టి వేడెక్కించెను షిండే! తేడా వస్తే తప్పదు కాంగీ నెత్తిన బండే!! గోడమీది పిల్లిలాగ జంపులొద్దు నాయకా! పూటకొక్క పాటవద్దు బహుళ గాత్ర గాయకా!! రావణకాష్టం సెగలో చలిని కాచుకోవద్దు! భవిష్యత్తు రాజకీయ చితిని పేర్చుకోవద్దు!! - ఏవీయస్

తడాఖా చూపిద్దాం..

తలలునరికి తనేమిటో చెప్పిందోయ్ పాకిస్తాన్ ! రాక్షస సంతతి చేష్టలు కళ్ళముందు ఖబరిస్థాన్ !! నిరంతరం కవ్వింపులు గతిమారని ఆ దేశం ! ప్రపంచానికిస్తోందీ జన నెత్తుటి సందేశం !! భారత సరిహద్దుల్లో హద్దులుదాటిన వైనం ! ఎంత రెచ్చగోడుతున్నా వీడని భారత సహనం !! ఉగ్రవాద దేశాలకు ఉప్పు పాతరెయ్యాలి...

ఫ్యూజు మాడిపోతుంది….

పెంచండోయ్ చార్జీలను మీ ఇష్టం వచ్చినట్టు ! కడతాళ్ళే సామాన్యుడు ఈ బిల్లులు చచ్చినట్టు !! రాష్ట్రంలో వున్న జనం బతకాలా..చావాలా ..! ప్రజలను కాపాడేందుకు దేవుడు దిగిరావాలా !! ఇవ్వoడోయ్ లాంతర్లను ఆదార్ కార్డుల మీద ! సర్కారీ అసమర్ధత ప్రోగ్రెస్ బోర్డుల మీద !! మానవత్వమే లేదా ఎన్నిసార్లు...

నాలిక జాగ్రత్త….

బుద్ధుందా అక్బరుడా నోరా అది తాటి మట్ట ! హిందూ ముస్లిం ల మధ్య బంధాలకు ఆనకట్ట !! భరతగాలి పీలుస్తూ బురదమాట లేల ! తేడాలెందుకు మనలో అనవసరపు గోల !! రాజకీయ లబ్దికొరకు ఇంతటి దిగజారుడా...

బీ కేర్ ఫుల్ బాబూ…

ముందుకు పోతోంది భలే చంద్రబాబు పాదయాత్ర ! ప్రత్యర్దులకిదో పెద్ద జీర్ణమవని చేదుమాత్ర !! సమస్యలే అజెండాగ కాలునెప్పి జానేదేవ్ ! చిత్తశుద్ధి వున్నప్పుడు బాధలంటూ లేనేలేవ్ !! అరవైదాటిన యువకుడి అలుపెరగని మహా టూరు ! క్యాడర్ లో నింపుతోంది నిలువెల్లా మెగా జోరు !! హామీలిచ్చేటప్పుడు అవసరమోయ్ బ్యాలెన్సూ...

LATEST