సిగ్గూ ఎగ్గూ జాన్తా నై !
తాజాగా బైటపడిన
మరో స్కాము అగస్టా !
ఓ మైగాడ్ అధికారం
మరీ ఇంత వరస్టా !!
అవినీతి తొ మురికిపట్టి
నల్లబడ్డ నా దేశం !
జనం ఖర్మ ఇంతేలే
తొక్కిపట్టు ఆవేశం !!
నిత్యకృత్య మీ...
వాపు అలియాస్ బలుపు
సహకారం సక్సెసుతో
ముఖ్యమంత్రి సంతోషం !
వాపు కాదు బలుపంటూ
జనావళికి సందేశం !!
రైతుల మద్దతు తమకని
కిరణ్ గారి ధీమా !
వస్తుందట ఇకమీదట
ఆత్మహత్యలకు కామా !!
ఎన్నికలే పరమార్ధం
కాకూడదు ఓ సీయం...
‘ ఉల్లీ ‘శ్వరి
ఎంతరేటు పెరిగిందీ
దేశంలో పెద్ద ఉల్లి !
కంటనీరు పెడుతోందీ
వంటింట్లో ప్రతి తల్లీ !!
ఉల్లిఘాటు తగలనుంది
కేంద్రప్రభుత్వానికి !
ధరలు నియంత్రించలేని
అసమర్ధత్వానికి !!
చంకలోన ఉల్లిపెడితె
వస్తుందంటా జ్వరం !
మంటపుడితె మారుతుంది
సామాన్యుడి...
హ్రస్వరూపం
కమలహసను కన్నీటికి
జవాబేది జయమ్మా !
పాలిటిక్సు పరాకాష్ట
ఇది ఎక్కడి దయమ్మా !!
ఆస్తులమ్మి అప్పుచేసి
ఓ సినిమా నిర్మిస్తే !
సబబేనా సర్కారుకు
దాన్ని ఇలా చంపేస్తే !!
సర్టిఫికెటు ఇచ్చారుగ
భేషుగ్గా సెన్సారోళ్ళు !
మంచిది కాదోయ్ జాతికి
నటుడికంట కన్నీళ్ళు !!
వివాదమే లేనప్పుడు
ఎందుకంట...
ముళ్ళ కిరీటం…
రాహుల్ గాంధీ చేతికి
కాంగిరేసు పెత్తనం!
డౌటేముందీ ఇది
ఇందిరమ్మ విత్తనం!!
అన్ని ముదురుకేసులతో
ఎలా నెట్టుకోస్తావూ!
చిల్లి పడిన పడవనెలా
గట్టుకు చేరుస్తావూ!!
పూలూ రాళ్లూ తప్పవు
పదవి చేతబట్టినాక!
తిట్లూ చీవాట్లు షురూ
కిరీటాలు పెట్టినాక!!
స్కాముల కక్షయపాత్రే
దేశంలో కాంగిరేసు!
ఆషామాషీ కాదోయ్
గెలవటమీ హార్సు...
LATEST
HYDRA : హైడ్రా మరో ముందడుగు, పిర్యాదులకోసం యాప్
నగరంలోని చెరువుల పరిరక్షణపై లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది....
జొమాటో సీఈవోని మాల్ లిఫ్ట్‌లోకి అనుమతించని సిబ్బంది
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్ అవతారం ఎత్తారు. విధుల్లో...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు : విదేశాంగ మంత్రి జై శంకర్
వచ్చే దశాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ముప్పు పొంచి ఉందని విదేశాంగశాఖ మంత్రి...
ఎస్బీఐలో కొత్తగా 10 వేల ఉద్యోగాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సుమారు 10 వేల మంది ఉద్యోగులను...