రాశి ఫలాలు : దిన ఫలాలు (25-01-2020)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, ఇతరత్రా చికాకులు తప్పవు. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలు గృహోపకరణాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఇపాధి పథకాల దిశగా సాగుతాయి. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది.

వృషభం :

బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు అధికం. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. మీ కుటుంబీకుల్లో వచ్చిన మార్పు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటు చేసుకుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరం.

మిథునం :

ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు. వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీల పేరిట స్థిరచరాస్తుల కొనుగోళ్లకు అనుకూలం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమించిన కొలదీ ఆదాయం.

కర్కాటకం :

నూతన వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఖర్చులు అధికం, ధన వ్యయంలో తగు జాగ్రత్తలు అవసరం. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగ, వృత్తిరీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది.

సింహం :

ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వస్త్ర, ఫ్యాన్సీ, బేకరీ వ్యాపారులకు పురోభివృద్ధి. బంధువుల మధ్య మనస్పర్ధలు తొలగి వారికి మరింత చేరువవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. అసాధ్యమనుకున్న పనలు సునాయసంగా పూర్తి చేస్తారు.

కన్య :

దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తుపోకడ మంచిది కాదని గమనించండి.

తుల :

స్త్రీలకు బంధువుల ఆదరణ, చుట్టుపక్కలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కష్టనష్టాలను కొంతమేర అధిగమిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఆర్థిక కుటుంబ సమస్యలు మెరుగుపడతాయి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.

వృశ్చికం :

బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించక పోవచ్చు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేయవలసి ఉంటుంది. నూతన కాంట్రాక్టులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం.

ధనస్సు :

నిరుద్యోగులు, వృత్తుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు అధికం. దూరప్రయాణాలు, పుణ్యక్షేత్ర సందర్శనలకు అనుకూలం. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికం.

మకరం :

ఉద్యోగస్తులు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు ఆకస్మిక ధనలాభం, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు ఆశాజనకం.

కుంభం :

విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది.

మీనం :

గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. స్త్రీల పేరిట పొదుపు పథకాలు లాబిస్తాయి. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. బంధువులు, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601