రాశి ఫలాలు : దిన ఫలాలు (24-11-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకారం అందిస్తారు. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు.

వృషభం :

నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి. అరుదైన సత్కారాలు, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలు చొరవగా వ్యవహరించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దంపతుల మధ్య చికాకులు తప్పవు.

మిథునం :

దీర్ఘకాలిక పెట్టుబుడులు, ఏజెన్సీలు, లీజు, నూతన టెండర్లకు అనుకూలం. బంధువులతోనూ, ప్రముఖులతోనూ పరిచయాలు మరింత బలపడతాయి. ఆదాయ వ్యయాలు మీ అంచనాలను మించుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలు పనివారలతో ఇబ్బందులను ఎదుర్కుంటారు.

కర్కాటకం :

భాగస్వామిక వ్యాపారాల మించి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. వాహన చోదకులకు ఊహించని చికాకులు ఎదురవుతాయి. వైద్య, టెక్నికల్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

సింహం :

కార్యసాధనలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. అర్థాంతంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు.

కన్య :

ఆర్థిక ఇబ్బంది లేకున్న తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. చేతి వృత్తి, వ్యాపారులకు కలిసివస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. స్త్రీలపై చుట్టు పక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

తుల :

వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనిభారం అధికం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తిమపు లభిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం :

ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అదికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు నూతన పరిచయాలు, నూతన వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. వైద్యులకు ఏకాగ్రత వసరం.

ధనస్సు :

మహిళా ఉద్యోగస్తులకు తోటి వారి వల్ల చికాకులు, అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలు పెడతారు. సన్నిహితుల సలహాను పాటించి ఒక సమస్యను అధికమిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం.

మకరం :

గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు తోటి వారి వల్ల చికాకులు, పనిభారం తప్పవు. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేస్తారు. బంధువుల రాక అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

కుంభం :

ఉమ్మడి ఆస్తి విషయాల్లో సోదరుల నుంచి అభ్యంతారాలెదుర్కుంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు నిరుత్సాహం కలిగిస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషిచంటం శ్రేయస్కరం కాదు. ఆదాయా వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు.

మీనం :

ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేయునపుడు పునరాలోచన అవసరం. మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. నూతన వ్యాపారాలుస ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601