శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601
మేషం :
ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసి వస్తుంది. గృహమునకు వస్తువుల అమర్చుకుంటారు. వ్యాపారస్తులకు ప్రభుత్వాధికారుల నుంచి సమస్యలు ఎదుర్కుంటారు. సోదరీ, సోదరులతో సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యర్ధులు మిత్రులగా మారుతారు.
వృషభం :
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలను ఎదుర్కుంటారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. స్త్రీలు దైవ, సేవా కార్యాక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
మిథునం :
మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లైక్యంగా వ్యవహరించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలించగలవు. మీ సంతానం పై చదువుల కోసం బాగా శ్రమిస్తారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.
కర్కాటకం :
నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్వయంకృషితో రాణిస్తారు. మీ శ్రీమతి మొండివైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
సింహం :
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. నిరుద్యోగులు, క్యాటరింగ్ పనివారలకు ఆశాజనకం. మిత్రుల మాటతీరు మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
కన్య :
మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞులతో సంప్రదించండి. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారులకు నిరుత్సాహం కానవస్తుంది. గృహంలో మార్పులు వాయిదా పడతాయి.
తుల :
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా క్రమేపీ సర్దుబాటు కాగలదు. వ్యాపారాల్లో అనవసర వ్యవహారాలకు దూరంగా ఉండటం వల్ల మేలు చేకూరుతుంది. విదేశాలు వెళ్లటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
వృశ్చికం :
కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలు టీవీ ఛానెళ్ల కార్యక్రమాలలో రాణిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్‌లు పూర్తి అవ్వడం కష్టం. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే కోరిక వాయిదా వేసుకోవలసి వస్తుంది. సంఘంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది.
ధనస్సు :
రాజకీయనాయకులకు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. కమీషన్‌దారులకు, మధ్యవర్తులకు ఆదాయం బాగుంటుంది. చేయు వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహము, వాక్చాతుర్యము యుండును. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం.
మకరం :
ఆర్థిక విషయాలలో జయం చేకూరుచతుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టవలసి వస్తుంది. చేయు వృత్తి, వ్యాపారాల యందు రాణింపు లభిస్తుంది. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
కుంభం :
ఆర్థికంగా పురోగమించటానికి చేయు యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి మీరు వేసే ప్రణాళికలు, పథకాలు సత్ఫలితాలనిస్తాయి. ఓర్పు, దీక్షతో అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది.
మీనం :
కోళ్లు, గొఱ్ఱె, మత్స్య వ్యాపారస్తులకు ఆందోళన, చికాకులు తప్పవు. కాంట్రాక్టుల విషయాల్లో ఏకాగ్రత, పినరాలోచన ముఖ్యం. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత అవసరం.
శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601