శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601
మేషం :
వస్త్ర, బంగారం, లోహ, పనివారలకు, వ్యాపారులకు లాభదాయకం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సమసిపోతాయి. ఫ్యాన్సీ, స్టేషనరీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఆస్థి వ్యవహారాలకు సంబంధించి సోదరుల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడుతుంది.
వృషభం :
ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థాన చలనానికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులను కలుసుకుంటారు.
మిథునం :
కోర్టు వ్యవహారాలు కొత్తమలుపు తిరుగుతాయి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి తప్పదు. రావలసిన ధనం చేతికి అందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. స్పెక్యులేషన్ రంగాల వారికి నిరుత్సాహం. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తుంది.
కర్కాటకం :
దైవ దర్శనాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలసిరాగలదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. ఖర్చులు అధికమవుతాయి.
సింహం :
వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సంతృప్తి కానరాదు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. దూర ప్రయాణాల్లో మెలకువ వహించండి. బంధుమిత్రుల రాకతో ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి, ఏకాగ్రత పెంచుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కన్య :
కార్యసాధనలో ఓర్పు, నేర్పు, పట్టుదల అవసరం. వ్యాపారాభివృద్ధికై నూతన ప్రణాళిక, పథకాలు అమలుచేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యల్లో ప్రవేశం లభిస్తుంది. ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గృహంలో కొత్త వాతావరణం, ఉత్సాహం సంతరించుకుంటాయి.
తుల :
ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి.
వృశ్చికం :
లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాల్లో మెలకువ అవసరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహిస్తే సత్ఫలితాలు పొందవచ్చు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఆత్మీయులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.
ధనస్సు :
కొత్తగా చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా స్థిరచిత్తంతో మెలగాల్సి ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను అమర్చుకుంటారు. వృత్తుల వారికి పురోభివృద్ధి.
మకరం :
ప్రేమికులకు పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. బ్యాంకు రుణాలు తీర్చడంతోపాటు కొంత రుణం తీసుకుంటారు. రావలసిన ధనం అందినా దానికి తగినట్లుగానే ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది.
కుంభం :
పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు వాయిదాపడతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఏ విషయంలోనూ ఇతరులపై ఆధారపడకుండా స్వయంకృషినే నమ్ముకోవటం మంచిది. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. చేతి వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
మీనం :
నూతన పరిచయాలు, వ్యాపకాలు కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. చేతివృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికమవుతాయి.
శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601