Site icon TeluguMirchi.com

రాశి ఫలాలు : దిన ఫలాలు (10-12-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొండి ధైర్యంతో శ్రమించి పూర్తి చేస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు సన్నిహితులు చేయూతనిస్తారు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారం మిమ్మల్ని సందిగ్ధంలో పడవేస్తుంది.

వృషభం :

లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యం. విద్యార్థినులకు ఏకాగ్రతా లోపం, వ్యాపకాలు అధికం కావటంతో చికాకులకు లోనవుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

మిథునం :

స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవచ్చును. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం. విద్యా సంస్థలలోని వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం.

కర్కాటకం :

రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి.

సింహం :

ఆర్థిక విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆహార వ్యహారాలలో మెళకువ వహించండి. రాజకీయ నాయకులకు కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఇంటి పనులలో నిమగ్నులౌతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు.

కన్య :

బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. పాత మిత్రుల కలయికతో కొత్త అనుభూతి పొందుతారు. గృహంలో ఏదైనా వస్తువు కనిపించకుండా పోయే ఆస్కారం ఉంది. ఏజెంట్లకు మిశ్రమ ఫలితం.

తుల :

ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఇతర కుటుంబ విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కోళ్ల, మత్స్య, గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికం అవుతుంది. స్త్రీలకు చుట్టుప్రక్కల వారినుంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. ప్లీడర్లకు ఒత్తిడి పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం :

పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు యత్నాల్లో సఫలీకృతులౌతారు. మీ వ్యక్తిగత భావాలను, సమస్యలను బయటికి వ్యక్తం చేయకండి. దూర ప్రయాణాలలో అనుకున్నంత సంతృప్తి కానరాదు. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలోని వారికి పురోభివృద్ధి. కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి.

ధనస్సు :

తలపెట్టిన పనిలో కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తి కానరాగలదు. స్తిరాస్థుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు తప్పవు. ముఖ్యులతో సంభాషించేటప్పుడు ఆచి, తూచి వ్యవహరించటం మంచిది.

మకరం :

కిరాణా, స్టేషనరీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలసివచ్చే కాలం. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ లక్ష్యసాదనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషి చేయండి. వృత్తి వ్యాపారాలలో మార్పులు అనుకూలిస్తాయి.

కుంభం :

కార్యసాధనలో సఫలీకృతులవుతారు. గత కొంతకాలంగా వేధిస్తున్న చికాకులు తొలగిపోవటంతో పాటు సమస్యలు పరిష్కారం కాగలవు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది.

మీనం :

చిన్నతరహా పరిశ్రమల వారికి పురోభివృద్ధి. స్త్రీల ఆలోచనలు, అభిప్రాయాలు పలు విధాలుగా ఉంటాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

Exit mobile version