Site icon TeluguMirchi.com

రాశి ఫలాలు : దిన ఫలాలు (05-12-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏమరుపాటుతనం కూడదు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వాజ్యాలు, ఫిర్యాదులు ఉపసంహరించుకుంటారు. మీ రాక బంధువులకు ఉత్సాహం కలిగిస్తుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటం మంచిది.

వృషభం :

పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. హామీలు, చెక్కుల జారీలలో పునరాలోచన మంచిది. కొన్ని వ్యవహాలలో సానుకూలతకు ధనం బాగా వ్యయం చేయవలసి ఉంటుంది. ఆత్మీయులకు కానుకలు సమర్పించుకుంటారు.

మిథునం :

ఆల్కహాల్, రసాయన, సుగంధ ద్రవ్యా వ్యాపారులకు కలిసిరాగలదు. ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికం. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. స్త్రీలకు బంధు వర్గాల నుండి ఆహ్వానాలు లేదా ఓ ముఖ్య సమాచారం అందుతుంది. రుణాలు తీరుస్తారు.

కర్కాటకం :

ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. స్త్రీలు గృహాంలకరణ పట్ల ఆసక్తి కనబరుస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. రుణాల కోసం అన్వేషిస్తారు.

సింహం :

ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. వ్యవసాయ కూలీలు, వృత్తుల వారికి ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఖర్చులు అధికంగా ఉన్న సంతృప్తి, ప్రయోజనం పొందుతారు. ప్రముఖుల సహకారంతో మీ పనులు సానుకూలమవుతాయి.

కన్య :

పోస్టల్, ఎల్ఐసీ ఏజెంట్లు, ఇళ్ల స్థలాల బ్రోకర్లకు పురోభివృద్ధి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు.

తుల :

స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులకు శుభాకాంక్షలు, బహుమతులు అందజేసి వారి ప్రాపకం సంపాధిస్తారు. వస్త్ర, బంగారం, వెండి, లోహ పనివారలకు ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. బంధువులను కలుసుకుంటారు.

వృశ్చికం :

వృత్తి, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. సంక్షేమ కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత ప్రయాసలెదుర్కో తప్పదు. ప్రయాణాలలోను, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి.

ధనస్సు :

ఉపాధ్యాయులకు, వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడుతారు. రుణ యత్నాల్లో ఆటంకాలు, ధనం సకాలంలో అందక పోవటం వల్ల మీ ఆర్థిక వ్యవహారాలు వాయిదా పడతాయి. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు.

మకరం :

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవటం మంచిది. క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. హామీల విషయంలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది.

కుంభం :

వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. ఖర్చులు చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు చికాకులు, ఒత్తిడి తప్పవు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం పొందుతారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.

మీనం :

వ్యాపారాల్లో పెరిగిన పోటీని తట్టుకోవటానికి బాగా శ్రమించాలి. స్త్రీలకు తమ బంధు వర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. మీ అభిప్రయాలు బయటకు వ్యక్తం చేయటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఇతరుల కారణాల వల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడుతాయి. నూతన పరిచయాలేర్పడుతాయి.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

Exit mobile version