రాశి ఫలాలు : దిన ఫలాలు (05-02-2020)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ప్రభుత్వ సంస్థలలో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుట మంచిది. కుటుంబంలోనూ, బయటా ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం.

వృషభం :

ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులకు గురవుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు, దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం :

నూతన వ్యక్తులతో స్త్రీలు అతిగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. వృత్తుల్లో వారు, వైద్యులు తమ తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలకు గురవుతారు.

కర్కాటకం :

వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారస్తులకు శుభం, జయం చేకూరుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. కొత్త రుణాల కోసం అణ్వేషిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.

సింహం :

సిమెంటు, కలప, ఇటుక వ్యాపారస్తులకు గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. మీ కళత్రమొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలు దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.

కన్య :

దంపతుల మధ్య కలహాలు తలెత్తగలవు. కొబ్బరి పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యుని సలహా తప్పదు. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైందని గమనించండి. ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.

తుల :

గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రుల సలహాతో నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల వైపు సాగుతాయి. దైవ, సేవా పాల్గొంటారు.

వృశ్చికం :

ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ రంగాలలో వారికి కలిసి రాగలదు. ఉద్యోగస్తులు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. ప్లీడరు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులు తప్పవు.

ధనస్సు :

ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పుల పడటం వల్ల మాటపడవలసి వస్తుంది. కుటింబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ తొందరపాటు నిర్ణయాలు మీకు ఎంతో ఆవేదన కలిగిస్తాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త మెళకువలు గ్రహిస్తారు.

మకరం :

ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. ఏ విషయంలో ఒంటెత్తు పోకడ మంచిది కాదు. దైవ కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.

కుంభం :

ఊహించని ఖర్చులు మీదపడటంతో రుణాలు, చేబదుళ్లు స్వీకరించ వలసి వస్తుంది. ఆయినవారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతం మాత్రంగానే ఉంటుంది.

మీనం :

ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి. స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివైన లక్షణం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601