శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601
మేషం :
ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. నిత్యావసర వస్టు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి. వీలైనంతవరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతి దూరం చేస్తారు.
వృషభం :
వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో ఆశించినంత పురోభివృద్ధి కానవస్తుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైనా పూర్తి చేస్తారు. సహోద్యోగులు, సన్నిహితులతో సమావేశం నిరాశాజనకంగా ముగుస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతులు గడిస్తారు.
మిథునం :
నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను సమకూర్చుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్ధానాలు నిలుపకోలేకపోతారు. ప్రైవేట్ సంస్థల్లోని వారు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో మనసు విప్పి మాట్లాడుకుంటారు.
కర్కాటకం :
రవాణా రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. సోదరీ సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. స్త్రీలకు వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహం :
మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సహం, సందడి చోటుచేసుకుంటుంది. మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు లేకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. రాజకీయ నాయకులు సభా సమావేశాల్లో పాల్గొంటారు.
కన్య :
వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయన సంపాదన దిశగా మీ ఆలోచనలుంచాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
తుల :
చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రైవేట్, పత్రికా సంస్థల్లోని వారికి మార్పులు వాయిదా పడతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం, కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృశ్చికం :
మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. మిమ్మల్ని అవహేళన చేసిన వారు మీ సహాయం అర్ధిస్థారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడతటంచో వారిలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలేనే మీ సంకల్పం నెరవేరుతుంది.
ధనస్సు :
కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమస్యలు తప్పవు. పారిశ్రామిక రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒక విషయంలో సోదరులతో విభేదిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెతే ఆస్కారం వుంది జాగ్రత్త వహించండి. బంధుమిత్రులను ధనం బాగా వెచ్చిస్తారు.
మకరం :
నిరుద్యోగులకు బోగస్ ప్రకటన వల్ల అప్రమత్తత అవసరం. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. ట్రాన్స్ పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మెలకువ అవసరం.
కుంభం :
కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ప్రేమికులు ప్రతి విషయంలో లౌక్యంగా మెలగవలసి ఉంటుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఖర్చులు సామాన్యం. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలవుతాయి.
మీనం :
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దైవ, సేవా, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం. పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కొంతమంది మీ ఉన్నతిని చూసి అసూయపడే ఆస్కారం వుంది.
శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601