Site icon TeluguMirchi.com

రాశి ఫలాలు : దిన ఫలాలు (29-10-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రవాణా రంగాలలోని వారికి ప్రయాణీకుల వల్ల ఇబ్బందులు తప్పవు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన ఆందోళన చెందుతారు. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవటంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.

వృషభం :

స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథునం :

సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయికతో మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. లాయర్లకు, డాక్టర్లకు పురోభివృద్ధి.

కర్కాటకం :

స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. వృత్తులవారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినతంగా ఉండదు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. మీ సంతానం విద్యా వివాహాలకు ఖర్చులు అధికమవుతాయి.

సింహం :

ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితం. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. రవాణా రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది. ఇంటర్వ్యూల్లో శ్రద్ధ వహించండి. ఫైనాన్సు, చిట్‌ఫండ్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు.

కన్య :

విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆకస్మిక పుణ్యక్షేత్ర సందర్శన వంటి ఫలితాలున్నాయి.

తుల :

ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నధులు సమకూర్చుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరుల సలహా విన్నప్పటికీ సొంతంగా నిర్ణయం తీసుకోవటం శ్రేయస్కరం. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. దుస్వప్నాలు మీకెంతో చికాకు, ఆందోళనలు తప్పవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.

వృశ్చికం :

వస్త్రములు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులకు విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కళాకారులకు అభివృద్ధి చేకూరుతుంది. సంఘంలో మీ మాటకు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. దూరప్రయాణాల్లో చికాకులు తప్పవు.

ధనస్సు :

ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు.

మకరం :

విద్యార్థులు విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు అర్థాంతంగా ముగిస్తారు. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. నూతన పరిచయాలేర్పడతాయి.

కుంభం :

దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ నైపుణ్యతకు, సామర్థ్యమునకు తగిన గుర్తింపు లభిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

మీనం :

సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయికతో మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. లాయర్లకు, డాక్టర్లకు పురోభివృద్ధి.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

Exit mobile version