రాశి ఫలాలు : దిన ఫలాలు (26-10-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. రవాణా రంగాలలోని వారికి ప్రయాణీకుల వల్ల ఇబ్బందులు తప్పవు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన ఆందోళన చెందుతారు. స్త్రీల అభిప్రాయాలకు ఆమోదం లభించకపోవటంతో కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి.

వృషభం :

ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలపై శకునాలు, దుస్వప్నాల ప్రభావం అధికమవుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. సోదరుల నుంచి మాటపడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ముఖ్యులను కలుసుకుంటారు.

మిథునం :

రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. న్యాయ వాదులతో సంప్రదింపులు చేస్తారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తాయి.

కర్కాటకం :

వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయ వర్గాల వారికి ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.

సింహం :

ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. గృహాలంకరణ అంశాలపై దృష్టి పెడతారు. దైవకార్యాలకు ఇతోధికంగా సహకరిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. కోర్టు వ్యవహారాలలో పురోగతి కానవస్తుంది.

కన్య :

విదేశాలు వెళ్ళడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆకస్మిక పుణ్యక్షేత్ర సందర్శన వంటి ఫలితాలున్నాయి.

తుల :

ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నధులు సమకూర్చుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరుల సలహా విన్నప్పటికీ సొంతంగా నిర్ణయం తీసుకోవటం శ్రేయస్కరం. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. దుస్వప్నాలు మీకెంతో చికాకు, ఆందోళనలు తప్పవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.

వృశ్చికం :

ఉపాధ్యాయులకు పనిభారం అధికం. కళ, క్రీడా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సంతానం పై చదువులు, ఉద్యోగ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయులకు విలువైన బహుమతులు అందిస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం మంచిది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

ధనస్సు :

ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల వారికి చికాకులు తప్పవు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తికాగలవు.

మకరం :

రుణాలు, పెట్టుబడుల కోసం చేసే యత్నం వాయిదాపడుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యుత్ రంగాల వారికి పనిభారం అధికం. సందర్భానికి అనుగుణంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుగుణంగానే ఉంటాయి.

కుంభం :

ఓ కొత్త అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావటంతో సంతృప్తిని పొందుతారు. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోయే ఆస్కారం ఉంది. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాలు గూర్చి తగాదాలు రావచ్చు.

మీనం :

స్త్రీలకు షాపింగ్‌‌లో ఏకాగ్రత ముఖ్యం. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ప్రయత్న పూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు వినవలసి వస్తుంది. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి కానవస్తుంది. చేతి వృత్తుల వారికి ఓర్పు, నేర్పు అవసరం.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601