Site icon TeluguMirchi.com

రాశి ఫలాలు : దిన ఫలాలు (25-10-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :
మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గొంటారు. మీ సంతానం భవిష్యత్తుకోసం నూతన పథకాలు చేపడతారు. ఖర్చులకు వెనుకాడకుండా ధనం బాగా వెచ్చిస్తారు. స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

వృషభం :
చేతిలో ధనం మితంగా ఉండటంతో ఆందోళన చెందుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడవలసివస్తుంది. వ్యాపారాల్లో పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ఆటుపోట్లు ఎదుర్కొనతప్పదు.

మిథునం :
మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. సంఘంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు సమకూర్చకుంటారు. విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం :
దైవదర్శనాల్లో శ్రమ, ప్రయాసలెదుర్కుంటారు. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమంకాదని గమనించండి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆటంకాలు తొలగిపోతాయి. పందేలు, జూదాల వల్ల సమస్యలు తలెత్తుతాయి.

సింహం :
దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఆటోమోబైల్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ప్రైవేటు సంస్థల్లో వారికి, ఆడిటర్లకి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రశంశలు లభిస్తాయి.

కన్య :
భాగస్వామికంగా కంటె సొంత వ్యాపారాలే మీకు అనుకూలిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. ముందస్తు జాగ్రత్తతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలిస్తాయి. రావలసిన ధనం చేతికందుతుంది.

తుల :
బంధుమిత్రుల రాకపోకలు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నా ధనానికి కొదువ ఉండదు. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరితంగా శ్రమించాలి.

వృశ్చికం :
విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పదు. దైవదర్శనంలో చికాకులు ఎదుర్కుంటారు. ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు. ఎగుమతి, దిగుమతి, ఆహారధాన్యాల వ్యాపారాలు లాభిస్తాయి. సిమెంటు, ఐరన్ వ్యాపారస్థులకు ఆశాజనకం.

ధనస్సు :
ప్రైవేటు సంస్థల్లో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరమని గమనించండి. బ్యాంకింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి. స్పెక్యులేషన్ రంగాల్లో వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశించినంత సంతృప్తి ఉండదు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు.

మకరం :
రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులకు లీవు, అడ్వాన్స్‌లు మంజూరవుతాయి. ప్రతి విషయంలోను స్త్రీలదే పైచేయిగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కుంభం :
నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. స్త్రీలకు టీవి ఛానెళ్ళు, కళాత్మక పోటీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు పరస్పరం విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఆకాల భోజనం వల్ల మీ ఆరోగ్యములో ఇబ్బందులు తప్పవు.

మీనం :
ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. స్త్రీలు కళాత్మక పోటీలు, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. మార్కెట్ రంగాల వారికి కలెక్షన్ ఏజెంట్లకు ఒత్తిడి అధికం. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండగలవు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు, చికాకులు వంటివి తలెత్తుతాయి.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

Exit mobile version