Site icon TeluguMirchi.com

రాశి ఫలాలు : దిన ఫలాలు (24-10-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :
గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్య సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. ప్ర్రైవేటు సంస్థల్లోని వారు తోటి వారితో స్నేహభావంతో సంచరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. గతంలో నిలిపివేసిన వ్యాపారాలు, పనులు పున:ప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి.

వృషభం :
ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఐరన్, సిమెంటు, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలిసిరాగలదు. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది.

మిథునం :
స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. రావలసిన ధనం అనుకోకుండా చేతికందును. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. భాగస్వామికుల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి. ప్రయాణాలలో అలసట ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం :
దంపతుల మధ్య ప్రేమానుబంధాలు విస్తరిస్తాయి. నిర్మాణ పనులలో జాప్యం, అధిక వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలుజ్ఞప్తికి వస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

సింహం :
ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావంతో పనిచేసి పెద్దలను, అధికారులను మెప్పిస్తారు. ఏదైనా అమ్మకానికై చేయు యత్నంలో సఫలీకృతులవుతారు.

కన్య :
పుణ్యక్షేత్రాల దర్శనంవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తులపట్ల అప్రమత్తత అవసరం. సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. హోటల్ బేకరీ, పండ్లు, తినుబండారాలు, పూల వ్యాపారులకు పురోభివృద్ధి.

తుల :
వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, చిరువ్యాపారులకు ఆశాజనకం. స్త్రీ కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. పాత రుణాలను తీర్చుతారు.

వృశ్చికం :
విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్థిరాస్తులకు సంబంధించి సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి.

ధనస్సు :
ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. దూరప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విదేశీయానం కోసం చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పొదుపు పథకాలు, స్ధిరాస్తి మూలక ధనం అందుతుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.

మకరం :
విద్యార్థుల అత్యుత్సాహం ఇబ్బందులకు దారితీస్తుంది. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. శ్రమకోర్చి పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పారిశ్రామిక రంగాల వారికి అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కుంటారు. వస్త్ర, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.

కుంభం :
బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు సంతృప్తి కానవస్తుంది. సోదరీ, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగి రాజాలదు. జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు.

మీనం :
విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రవాణా వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. బదిలీలు, మార్పులు చేర్పులు గురించి ఓ నిర్ణయం తీసుకుంటారు. ఖర్చులు అధికం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

Exit mobile version