Site icon TeluguMirchi.com

రాశి ఫలాలు : దిన ఫలాలు (23-10-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :
కార్యసాధనలో అనుకూలత, వ్యవహారాల్లో జయం పొందుతారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. ప్రయత్నపూర్వకంగా పాతబాకీలు వసూలు కాగలవు. స్త్రీలకు సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా సాగవు.

వృషభం :
నిరుద్యోగులు ఇంటర్వ్యూలు, ఉపాథి పథకాల్లో రాణిస్తారు. ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదురవుతాయి. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. రుణాలు తీరుస్తారు. ఏ పనియైనా తలపెట్టని ఆందోళన, నిరుత్సాహానికి గురవుతారు. ఆదాయ వ్యయాలకు ఏమాత్రం పొంతన ఉండదు.

మిథునం :
ఆప్తులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మిమ్ములను కలవరపరిచిన సంఘటన సునాయసంగా సమసిపోగలవు. బ్యాంకు ఫైనాన్స్ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కిందిస్థాయి వ్యక్తులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కళ, క్రీడ, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం.

కర్కాటకం :
మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. శ్రమకు తగిన ఫలితాలు తక్కువగా ఉంటాయి. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.

సింహం :
కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. విద్యార్థినులు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. నిత్యావసరవస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు అధికారిక తనిఖీలు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

కన్య :
హామీలు మధ్యవర్తిత్వాల విషయంలో మొహమ్మాటాలు ఒత్తిళ్లు ఎదుర్కుంటారు. మీ అయిష్టాన్ని, ఇబ్బందులను సున్నితంగా వ్యక్తం చేయాలి. ఆదాయ వ్యయాలు మీ అంచనాలను మించుతాయి. ప్రతి విషయాన్ని మీ శ్రీమతికి తెలియజేయటం మంచిది. ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి వ్యాపార వ్యవహారాలను గోప్యంగాఉంచాలి.

తుల :
ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ, వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రుణం తీసుకోవటం, ఇవ్వటం క్షేమం కాదని గమనించండి. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది.

వృశ్చికం :
మీరు ఎదురుచూస్తున్న పత్రాలు, రశీదులు చేతికందుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనకూలించవు.

ధనస్సు :
ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం ఆలోచన విరమించుకోవటం మంచిది. వృత్తిపరంగా ఎదుర్కుంటున్న ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు అస్వస్థత, నీరసం వంటి చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. దంపతుల మధ్య అరమరికలుండకూడదు.

మకరం :
స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. ఆత్మీయులతో ఒక పుణ్యక్షేత్రం సందర్శనానికి సన్నాహాలు సాగిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేసి అధికారులను సంతృప్తిపరుస్తారు. ఒప్పందాలు, చెక్కుల జారీలో ఏకాగ్రతముఖ్యం.

కుంభం :
ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. భాగస్వామికుల కదలికలను అనుక్షణం గమనిస్తుండాలి. ఖర్చులు అధికం. ప్రతి పనిలో శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వంటి చికాకులెదుర్కుంటారు. మీ ఏమురుపాటు వల్ల విలువైన వస్తువులు, పత్రాలు చేజార్చుకుంటారు.

మీనం :
ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలు, అధికారుల ఒత్తిళ్లతో మనస్థిమితం ఉండదు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. చేపట్టిన పనులు మొండిగా శ్రమించి పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలు సామాన్యం. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు, అభ్యంతరాలెదుర్కోవలసివస్తుంది.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

Exit mobile version