శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601
మేషం :
చిన్ననాటి స్నేహితుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు. ఒక స్ధిరాస్తి అమ్మకం అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి.
వృషభం :
అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలు టీవీ కార్యక్రమాలు, పోటీల్లో రాణిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవటం మంచిది. ఖర్చులు అధికమవుతాయి. వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
మిథునం :
రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. ఇతరులను ధనసహాయం అర్ధించటానికి మొహమ్మాటం చెందుతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మందలింపులు తప్పవు. మంచి మాటలతో అందరినీ ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. సేవా దైవ కార్యక్రమాల్లోపాల్గొంటారు.
కర్కాటకం :
ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అదుపుకాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు.
సింహం :
వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు స్వల్ప లాభాలు గడిస్తారు. నిరుద్యోగులలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఇష్టం లేని వారికి సలహా ఇచ్చి భంగపాటుకు గురవుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. కుటుంబీకులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు.
కన్య :
మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. మార్కెట్టు రంగాల వారు తమ టార్గెట్టును పూర్తిచేస్తారు. కొబ్బరి, పండ్లు, పూల చిరువ్యాపారులకు లాభదాయకం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విదేశీ యత్నాలలో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. పాత బాకీలు తీరుస్తారు.
తుల :
స్త్రీలపై సెంటిమెంట్లు, పొరుగువారి మాటల ప్రభావం అధికం. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. సభలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులకు వెరవక ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలం.
వృశ్చికం :
ఒక వ్యవహార నిమిత్తం తరచు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో గత అనుభవాలు ముచ్చటిస్తారు. స్త్రీలకు చుట్టుప్రక్కల వారితో మనస్పర్థలుతలెత్తినాతేలికగా పరిష్కరిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శనం అనుకూలం.
ధనస్సు :
మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగల్గుతారు. విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిఇస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. దూర ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు.
మకరం :
బంధువుల రాక వల్ల మీ పనులు, రోజువారీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. స్త్రీలకు అధికమైన శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యంలో చికాకులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు. ఆత్మీయులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి.
కుంభం :
ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి పనిలో ఒత్తిడి చికాకులు తప్పవు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపట్ల మక్కువ పెరుగుతుంది. వాహన చోదకులకు జరిమానాలు, మరమ్మతులు వంటి చికాకు లెదురవుతాయి. ఆఫ్తుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
మీనం :
ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తి కావు. సన్నిహితులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కోల్పోయిన అవకాశం, వస్తువులు చేజిక్కుంచుకుంటారు. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత తప్పదు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.
శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601