శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601
మేషం
ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తిగా చురుకుగా పాల్గొంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. పాతఋణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు.
వృషభం
కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. బ్యాంకు పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. ఏకాంతం కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. ప్రింటింగ్, స్టేషన్ రంగాల వారు అచ్చుతప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు.
మిథునం
భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదములు తలెత్తె ఆస్కారం ఉంది. బంధువుల రాక, కలయిక ఆనందాన్నిస్తుంది. బ్యాంకు వ్యవహారాలు హడావిడిగా పూర్తి చేస్తారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. విద్యార్ధులు క్రీడా పోటీల పట్ల ఆసక్తి చూపుతారు. తలచిన కార్యముల్లో జాప్యం. అధికమైన ఖర్చులను ఎదుర్కొంటారు.
కర్కాటకం
రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. క్రమేణా రుణాలు తీరుస్తారు.
సింహం
విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికం అవుతాయి. ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
కన్య
స్త్రీలకు తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వృత్తి పనులు వారికి ఆదాయం బాగుంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రుణ విముక్తులు కావాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరతాయి. సంతకాలు, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త వహించండి.
తుల
అనవసర సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. పత్రికా సంస్థలోని వారికి చిన్న చిన్న తప్పిదాలు దొర్లే సూచనలున్నాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. పూర్వవిద్యార్థుల కలయికతో గత అనుభవాలు గుర్తుకొస్తాయి. ధనం అందుకుంటారు.
వృశ్చికం
స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. వైద్యులు శస్త్ర చికిత్స చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప చికాకులు ఎదుర్కుంటారు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకు డిపాజిట్ల సొమ్ము ముందుగానే తీసుకోవలసి వస్తుంది.
ధనస్సు
పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించాలి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం వారి నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు.
మకరం
బెట్టింగ్‌లు, జూదాలు, వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ శక్తిసామర్ధ్యాలు, నిజాయితీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. లాయరు నోటీసు ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం విద్యావిషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఆందోళన చెందుతారు.
కుంభం
బంధువులు మీనుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్ధిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఫ్యాన్సీ, మందులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి.
మీనం
రాజకీయనాయకులు సభలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. వాహనం ఏకాగ్రతతో నడపటం క్షేమదాయకం. ప్లీడర్లకు తమ క్లయింట్‌ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601