రాశి ఫలాలు : దిన ఫలాలు (18-11-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆశించినంత పురోగతి ఉండదు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మీ గృహ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు ప్రోత్సాహం లభించగలదు. ఎదుటివారితో ఆచితూచి సంభాషించండి. దంపతుల మధ్య ఏకీభావం కుదురును.

వృషభం :

ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుట వలన మాటపడక తప్పదు. ఉద్యోగస్తులకు పై అధికారులతో సదవగాహన, తోటివారి సహకారం లభించదు. వైధ్యులు అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికస్థితి ఆశించినంత మెరుగు పడక పోవటంతో ఒకింత నిరుత్సాహం తప్పదు.

మిథునం :

కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. సోదరీ సోదరులతో ఏకీభావం కుదరదు. నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు.

కర్కాటకం :

ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకువేస్తారు. నూతన అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. మీ శ్రీవారు మీతో ఆసక్తికరమైన విషయాలు చర్చిస్తారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుట వలన జయం చేకూరుతుంది.

సింహం :

కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు చికాకు తప్పదు. స్త్రీలు తేలికగా మోసపోయే ఆస్కారం కలదు. ఖర్చులు మీ స్థోమతకు తగినట్లుగానే ఉంటాయి. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు కలిసిరాగలదు. అర్ధాంతంరంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం.

కన్య :

స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అధికారులతో ఏకీభావం కుదరదు. ఏదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. సహచరుల సలహాల వల్ల నిరుద్యోగులు సదవకాశాలు జారవిడుచుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.

తుల :

రాజకీయ నాయకులకు ఆహార వ్యవహారాలలోనూ, ప్రయాణాలలోను మెళకువ అవసరం. క్రీడా, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్నేహ బృందాలు అధికమవుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది.

వృశ్చికం :

ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఆశాజనకం. ప్రైవేటు సంస్థలలో వారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడక తప్పదు. స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి.

ధనస్సు :

కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.

మకరం :

ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపుల విషయంలో సంతృప్తి కానరాగలదు. కుటుంబీకుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యాపారులకు పోటీ పెరగటంతో పాటు ఆశించినంత ఆర్థిక సంతృప్తి ఉండదు. ఉపాధ్యాయులు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.

కుంభం :

పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వాహనం, వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది.

మీనం :

బ్యాంకింగ్ వ్యవహారాలలో అఫరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న సమసిపోగలవు. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. మిత్రులతో కలిసి ఓ మంచి పనికి శ్రీకారం చుడుతారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలలో మెళకువ అవసరం.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601