Site icon TeluguMirchi.com

రాశి ఫలాలు : దిన ఫలాలు (07-11-2019)

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

మేషం :

భాగస్వామికులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రింటింగ్, కంప్యూటర్ రంగాల వారకి లాభసాటి అవకాశాలు లభిస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వాహనం చోదకులకు ఏకాగ్రత ప్రధానం. మీ రాక ఆత్మీయులకు సంతోషం కలిగిస్తుంది. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి.

వృషభం :

వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. దైవదీక్షలు, సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి.

మిథునం :

వృత్తి వ్యాపారాలు, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. దైవదీక్షలు, సభ్యత్వాలు, పదవులు స్వీకరిస్తారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి.

కర్కాటకం :

ఉమ్మడి వెంచర్లు, పొదుపు పథకాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు, కార్యక్రమాలు అనుకున్నవిధంగా సాగవు. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

సింహం :

భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. రిప్రజెంటేటివ్‌లు, పత్రికా సిబ్బంది ఓర్పు, అంకితభావం ప్రధానం. అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పన్నులు, వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు.

కన్య :

ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో తొందరపడవద్దు. వ్యాపారాల్లో కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. సభ్యత్వాలు, పదవులకు వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. షాపు పనివారలతో జాగ్రత్త అవసరం. సహోద్యోగుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.

తుల :

ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. బంధువుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగత రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు. హోల్‌సేల్ వ్యాపారులు పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం :

వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవాలి. రాజకీయనాయకులకు ప్రయాణాల్లో మెళకువ అవసరం. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం, వాహనయోగం వంటి శుభఫలితాలున్నాయి. ఉపాధ్యాయులు ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నూతన పెట్టుబడులు, సంస్థల స్థాపనకు అనుకూలం.

ధనస్సు :

ఆదాయ వ్యయాలకు లోటుండదు. లైసెన్సులు, పర్మిట్‌‍ల రెన్యువల్‌లో జాప్యం స్త్రీలతో మితంగా సంభాషించండి నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సోదరులతో ఏకీభవించలేకపోతారు. అధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం తప్పవు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి.

మకరం :

కావలసిన వ్యక్తులను కలుసుకుంటారు. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మీ చికాకులు, సమస్యలు, ఇబ్బందులు త్వరలో కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.

కుంభం :

పెద్ద మొత్తం ధనసహాయంలో లౌక్యంగా ఉండాలి. శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏ పని సాగక విసుగు చెందుతారు. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదే.

మీనం :

రేషన్, గ్యాస్, పెట్రో డీలర్లకు వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఉద్యోగస్తులు అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. కొత్త ప్రాజెక్టులకు అనుకూలం.

శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం
పండిత్:-వాదిరాజ భట్ట
9743666601

Exit mobile version