మొక్కలు బాగా పెరగాలన్న దిగుబడులు మంచిగా రావాలన్న గాలి, వెలుతురు, సూర్యరశ్మి,వాతావరణం ఎంత ముఖ్యమో అలాగే మొక్కలకు స్థూల, సూక్ష్మపోషకాలు అంతే అవసరం. పోషకాలు సమపాళ్ళలో అందకపోతే పంటలలో దిగుబడి నాణ్యత చాల వరకు తగ్గుతుంది. కాబట్టి మొక్కలలో పోషక లోపం రాకుండా చూసుకోవడం చాల అవసరం. అన్ని మొక్కలకు ఒకే రకమైన పోషక లోపాలురావు. వాటిని గుర్తించి తగిన పోషకాలు అందించాలి.
1)నత్రజని (Nitrogen)ఉపయోగాలు = మొక్క పుట్టినప్పటినుండి చివరివరకు నత్రజని అవసరం ఉంటుంది.మొక్కలకు ప్రోటిన్స్ అందించడంలో సహాయ పడుతుంది.
నత్రజని లోపం = మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. మొక్కలు పసుపురంగులోకి మారిపోతాయి.ముదురు ఆకులు ఎండిపోవడం జరుగుతుంది.
2)పోటాష్ (Potassium)ఉపయోగాలు = వాతావరణంలో హెచ్చుతగ్గుల నుండి మొక్కలను కాపాడుతుంది. కాయలలో గింజల నాణ్యతను పెంచుతుంది.మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పోటాష్ లోపం = పోటాష్ లోపం మొక్కల ముదురు ఆకులలో కనిపిస్తుంది ఆకులు పసుపు రంగులోకి మారి ఆకులపై తుప్పు మచ్చలు కనిపిస్తాయి.
3)బాస్వారం (Phosphorus)ఉపయోగాలు = లేతమొక్కలలో వేరువ్యవస్థ పెరగడానికి సహాయపడుతుంది. మరియు మొక్కలకు ప్రోటిన్స్ సమపాళ్ళలో అందిస్తుంది.
బాస్వారం లోపం = మొక్కల ఆకులు ముదురు గోధుమ రంగులోకి మారుతాయి. మొక్కలు గిడసబారి ఎదుగుదల ఉండవు. ఆకులు నీలి రంగులోకి మారి నిలబడి ఉంటాయి.
4)మేగ్నిషం (Magnesium)ఉపయోగాలు = భూమిలో ఉన్న ప్రోటీన్లను మొక్కలకు అందిస్తుంది. బాస్వరం ఎరువులను మొక్కలకు సమపాళ్ళలో అందిస్తుంది.
మేగ్నిషం లోపం = మేగ్నిషం లోపం ముదురు ఆకులలో కనిపిస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారటం లోపం ఎక్కువగా ఉన్నపుడు ఊదరంగులోకి మారి ఆకుల చివరి బాగంలో మచ్చలు ఏర్పడి ఆకులు రాలి పోవడం జరుగుతుంది.
5)గంధకం (Sulfur)ఉపయోగాలు = గంధకం నత్రజని మాదిరిగా మొక్కలలో కిరణజన్య క్రియ సంక్రమంగా జరగడానికి దోహద పడుతుంది. నూనే గింజల పంటలలో నూనే శాతం పెరగడానికి గంధకం ఉపయోగ పడుతుంది.
గంధకం లోపం = గంధకం లోపం మొక్కలలో చిగురుటకులలో కనిపిస్తుంది. ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి పాలిపోయి కనిపిస్తాయి. మొక్కలలో పూతలు కనిపించడం మందగిస్తుంది. నూనే గింజల పంటలలో గంధక లోపం ఎక్కువగా కనిపిస్తుంది.
6)మాంగానీసు (Manganese) ఉపయోగాలు = మొక్కలలో ఇనపధాతు లోపాన్ని సరిచేస్తూ మొక్కలలో కిరణజన్య క్రియను సరిచేస్తుంది.
మాంగానీసు లోపం = మాంగానీసు లోపం ఉన్న మొక్కలలో ఆకుల ఈనెల మద్య బాగం పసుపు రంగులోకి మారి ఆకులు క్రిందకు ముడుచుకొని ఉంటాయి.
7)రాగి (Copper)ఉపయోగాలు = మొక్కలలో విటమిన్ “A” లోపం రాకుండా కాపాడుతుది.
రాగి లోపం = మొక్కల ఆకులు నీలి రంగులోకి మారి ఆకుల చివరి బాగం పసుపు రంగులోకి మారి చివరకు ఎండి పోతాయి.కాయలను పట్టుకొని చుస్తే బంకలగా అంటుకుంటుంది.
8)బోరాన్ (Boron)ఉపయోగాలు = మొక్కలలో పూత పిందే రాలకుండా, చిగురుటాకులు క్రమ పద్ధతిలో పెరుగుదలకు సహాయ పడుతుంది.
బోరాన్ లోపం = మొక్కలలో చిగురుటాకులు ఆకుపచ్చ రంగును కోల్పోయి మెలికలు తిరిగి వంకరగా కనిపిస్తాయి. లేత ఆకులు మందంగా తయారై ఎదుగుదల లోపిస్తుంది. కాయలపై,కాండముపై పగుళ్ళు ఏర్పడతాయి. లేత పిందెలు మాడిపోవడం జరుగుతుంది.
9)క్యాలిషయం (Calcium)ఉపయోగాలు = క్యాలిషయం మొక్కల పెరుగుదలకు,మొక్కకు వేర్లు బాగా రావడానికి, కాయలలో గింజల శాతం పెరగడానికి క్యాలిషయం బాగా ఉపయోగపడుతుంది.
క్యాలిషయం లోపం = క్యాలిషయం లోపం ఉన్న మొక్కలలో లేత ఆకుల చివరి బాగంలో ఎండినట్లు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు ఆకులు రాలిపోవడం జరుగుతుంది. లేత ఆకులు పైకి డోప్పలాగా ముడుసు కుంటాయి.
10)ఇనుము (Iron)ఉపయోగాలు = ఆకులలో పత్రహరితం కోల్పోకుండా దాని తయారికి కీలక పాత్ర పోషిస్తుంది.వివిధ రాకల పోషకాలను మొక్కలకు అందిస్తుంది.
ఇనుము లోపం = మొక్కల లేత ఆకులలో ఇనుపధాతు లోపం కనిపిస్తుంది. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఆకులు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. చౌడునేలల్లో కూడా ఇనుము లోపం కనిపిస్తుంది.
11)జింక్ (Zinc)ఉపయోగాలు = మొక్కలు గిడసబారి పోకుండా నత్రజని ఎరువులను మొక్కలకు అందిస్తుంది.లేత మొక్కలకు తగిన పోషకాలు అందించడంలో సహాయపడుతుంది.
జింక్ లోపం = జింక్ లోపం ఉన్న మొక్కలలో కణుపుల దూరం తగ్గడం, ఆకుల చివరి అంచులు ఎండినట్లు కనిపించడం,ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడటం జరుగుతుంది.
12)మాలిబిద్దనం (Molybdenum)ఉపయోగాలు = మొక్కలకు నత్రజని వినియోగాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇనుముదాతు లోపం రాకుండా మొక్కలను రక్షిస్తుంది.
మాలిబిద్దనం లోపం మొక్కల ముదురు ఆకులలో కనిపిస్తుంది మొక్కల ఎదుగుదల లోపిస్తుంది, మొక్కలు పసుపు రంగులోకి మారి నత్రజని లోపం ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఆకులపై ఎరుపు రంగు మచ్చలు ఏర్పడతాయి.
గమనిక : అధిక పోషక విలువలు వున్న KAP Bio Manure వాడండి, పంటల్లో పోషక లోపాల్ని సవరించండి.