ధృవ ట్రాక్ లిస్ట్..

dhruva-songs-listమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పవర్ ఫుల్ ఆఫీసర్ గా తెరకెక్కిన చిత్రం ‘ధృవ’. తమిళం లో సూపర్ హిట్ అయిన తనీఒరువన్ చిత్రానికి రీమేక్ గా తెలుగు లో ఈ మూవీని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 95% షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ నెల 9 న ఆడియో మార్కెట్లోకి విడుదల కాబోతుండగా , మొత్తం ఈ మూవీ లో నాల్గు సాంగ్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి రిలీజ్ కాబోతుంది.

ఇక ట్రాక్ లిస్ట్ & పాడినవారిని చూస్తే..

* ‘ధృవ.. ధృవ’ టైటిల్ సాంగ్ అమిత్ మిశ్రా పాడడం జరిగింది..

* ‘చూశా చూశా’ అంటూ సాగే సాంగ్ ను పద్మలత – స్నిగ్గీ

* ‘ నీతోనే డ్యాన్స్’ అనే సాంగ్ హిప్ హాప్ తమీజా-నికితా గాంధీ

* ‘పరేశానురా’ అంటూ సాగే పాటను పద్మలత పాడడం జరిగింది. ఫై మూడు సాంగ్స్ కు చంద్రబోస్ సాహిత్యం అందించగా , చివరి సాంగ్ కు యాదగిరి సాహిత్యం అందించారు. కోలీవుడ్ లో అతి తక్కువ టైం లో రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హిప్ హాప్ తమీజా ధృవ కు సంగీతం అందించారు. తొలిసారి తాడు తెలుగు లో మ్యూజిక్ చేయడం తో ఈ సాంగ్స్ ఫై శ్రోతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల రిలీజ్ చేసిన ప్రొమో సాంగ్స్ చేస్తే అర్ధం అవుతుంది.