మోహన్ లాల్ రెండువందల కోట్లు కొల్లగొట్టాడు.

Mohanlalమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , కేవలం రెండు నెలల వ్యవధిలో రెండు వందల కోట్లు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించాడు..ఎన్టీఆర్ – మోహన్ లాల్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ చిత్రం ఎన్టీఆర్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు మొదటి సారి 100 కోట్ల క్లబ్ లో చేర్చింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ కు సమానంగా మోహన్ లాల్ పాత్ర వుంది.ఈ చిత్రం తెలుగు , కన్నడ , తమిళనాట కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రం తర్వాత మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన ఒప్పం తమిళనాట రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కూడా 50 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరో నెల రోజుల గ్యాప్లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్మూవీ మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకుపోతుంది. ఇలా రెండు నెలల వ్యవధిలోనే మూడు సినిమాలతో 200 కోట్ల కలెక్షన్లను సాధించడం ఒక్క మోహన్ లాల్ కే చెల్లింది.