దిల్ రాజు హీరో అయ్యాడు…

Dil-Raju-At-Remo-audio
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అంటే ఎవరైనా టక్కున చెప్పే ఫస్ట్ పేరు దిల్ రాజు…దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా వస్తున్న , అతడు డిస్ట్రబ్యూట్ చేసిన ఏ చిత్రమైన సూపర్ హిట్ అవుతుందని అందరూ నమ్ముతారు..తాజాగా తమిళం లో సూపర్ హిట్ అయినా రెమో చిత్రాన్ని తెలుగు లో డబ్ చేయబోతున్నాడు.నిన్న సాయంత్రం ఈ ఆడియో వేడుకను సమంత చేతుల మీదుగా లంచ్ చేసారు..కాగా ఈ ఆడియో కి దిల్ రాజు హీరో మాదిరిగా రెడీ అయ్యి రావడం తో , ఆడియో కు వచ్చిన అతిధుల తో పాటు సినీ నటులు కూడా దిల్ రాజు హీరో గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ఇలా తయారీవచ్చాడు అంటూ కామెంట్స్ వేశారు..

దిల్ రాజు వయసు కనపడకుండా మెయింటైన్ చేస్తాడన్న సంగతి తెలిసిందే..ఈ ఆడియో లో కూడా అలాగే కనిపించాడు. ఈ తరం కుర్రాళ్ల తరహాలో కనిపించాయి. షూస్.. గాగుల్స్.. అన్నీ కూడా ఓ రేంజిలో మెయింటైన్ చేశాడు. ముఖ్యంగా గాగుల్స్ చొక్కా బొత్తానికి తగిలించుకుని ఆయన విచ్చేసిన తీరు చూసి షాక్ అయ్యారు. ఎప్పుడు సింపుల్ గా తయారై వచ్చే రాజు.. ‘రెమో’ వేడుకకు మాత్రం చాలా స్టైలిష్ ఔట్ ఫిట్ తో విచ్చేశాడు. మరో పక్క హీరోయిన్స్ కీర్తి సురేష్ , సమంత లు దిల్ రాజు ను చూసి ఏంటి సర్ హీరో గా ట్రై చేస్తున్నారా అంటూ సరదాగా కామెంట్స్ చేసారు.