కమల్‌-గౌతమి విడిపోతున్నారా..?

kamal-gowthamiతెలుగు , తమిళ భాషలలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ , గత 13 ఏళ్లగా నటి గౌతమీ తో సహజీవనం సాగిస్తున్న సంగతి తెల్సిందే…తాజాగా మీము విడిపోతున్నాం , ఇక కమల్ హాసన్ తో సహజీవనం కొనసాగించలేమని షాకింగ్ వార్తను ప్రకటించింది గౌతమీ.

ఈ విషయాన్నీ స్వయంగా గౌతమీ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.. ‘నేను, మిస్టర్‌ హాసన్‌ ఇంక ఎక్కువ కాలం కలిసి ఉండలేమన్న విషయం నా హృదయాన్ని చిదిమేస్తోంది. దాదాపు 13 ఏళ్లు కలిసి ఉన్న తర్వాత, నేను నా జీవితంలో తీసుకుంటున్న అతి భయంకరమైన నిర్ణయం ఇది. కమిటెడ్‌ రిలేషన్‌ షిప్‌లో మన కలలే ముఖ్యమని అనుకోవడమా, లేక వాటిని కాదని జీవితంతో రాజీ పడడమా అని తేల్చుకోవడం ఎవరికీ అంత సులభతరమైన పనికాదు. హృదయం బద్దలయ్యే ఈ నిజం అంగీకరించడానికి, ఈ నిర్ణయానికి రావడానికి చాలా కాలం పట్టింది.

ఒకర్ని తప్పుపట్టడానికో లేక సానుభూతి పొందడమో నా ఉద్దేశం కాదు. నా జీవితాన్ని నేను అర్థం చేసుకున్నా. మార్పు అనేది మానవ సహజం. నేను మొదట తల్లిని. సాధ్యమైనంత వరకు నా బిడ్డకు బెస్ట్‌ మదర్‌గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకు నాతో నేను ప్రశాంతంగా ఉండాలి. నేను చిత్ర పరిశ్రమలోకి రాకముందు, వచ్చిన తర్వాత కమల్‌హాసన్‌కు పెద్ద అభిమానిని అనడంలో పెద్ద రహస్యం లేదు. అంటూ గౌతమీ ఓ లేఖ ద్వారా తెలిపింది..

ఇక ఈ లేఖను చూసిన అభిమానులు వీరికి ఏమైంది..సడెన్ గా గౌతమి ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది..అసలు కారణాలు ఏంటి..అంటూ మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి గౌతమీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ షాక్ అవుతున్నారు..