రజని ధూమపానం మానేయడానికే ఆ వ్యక్తినే కారణమట..

rajnismokeమామూలు బస్‌ కండక్టర్‌ స్థాయి నుండి సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగిన రజనీకాంత్ జీవితం సగటు సినీ జీవికి ఆదర్శప్రాయం. ‘అపూర్వ రాగంగళ్‌’ అనే తమిళ చిత్రం ద్వారా ప్రారంభమైన రజనీ నటనా ప్రస్థానం ఇటీవల ‘రోబో 2.0’ సినిమా వరకు సాగుతూనే ఉంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషలతో పాటు బెంగాళీ, ఇంగ్లీష్‌ భాషల్లో సైతం నటించి తన నటనా కౌశలాన్ని అన్ని ప్రాంతాల ప్రజలకు చూపించారు. అలాంటి గొప్ప నటుడు ధూమపానానికి, మద్య పానానికి దూరం అవడానికి కారణం…సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ అని చెప్పుకొచ్చాడు.

కెరియర్ మొదట్లో ధూమపానానికి, మద్య పానానికి అలవాటు ఉండేదని , ఆ దశలో శివకుమార్ ఆ అలవాట్లను వదులుకొమ్మని సూచించాడని రజనీ తెలిపాడు. మంచి నటుడిగా ఎదగాలంటే ఆ అలవాట్లను వదలుకోవాలని శివకుమార్ చెప్పాడని, ఆయన సూచనలను పాటించి తను ధూమపానానికి, మద్య పానానికి దూరం అయ్యానని రజనీ వివరించాడు. ఆ విధంగా శివకుమార్ తనకు మార్గదర్శి అయ్యాడన్నాడు. అంతే కాకుండా వారి కుమారులు సూర్య , కార్తీ అన్న చాల ఇష్టమని చెప్పుకొచ్చాడు.