ఖైదీ నెంబర్ 150 నైజాం రైట్స్ ఎంతో తెలుసా..?

chiru-diwali-giftమెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిన దగ్గరి నుండే ఆ సినిమా ఫై అంచనాలు పెంచుకున్నారు సినీ అభిమానులు..ఇప్పుడు ఈ సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ , వర్కింగ్ స్టిల్స్ ఇలా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే చిరు 150 వ చిత్రం ఫై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి..

ఇప్పటికే రికార్డు స్థాయి లో అన్ని ఏరియాల్లో బిజినెస్ జరుగుతుండగా , అతి పెద్ద మార్కెట్ అయినా నైజాం ఏరియాల్లో ఖైదీ నెంబర్ 150 రికార్డు స్థాయి లో ధర పలికిందని సమాచారం. ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు దాదాపు 21 కోట్లకు ఖైదీ నెంబర్ 150 హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా , దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. వినాయక్ దర్శకుడు..