రణ్‌బీర్‌ తో డేటింగ్ ఫై శృతి హాసన్ క్లారిటీ..

ranbir-sruthi-loveతెలుగు, తమిళ్ , హిందీ భాషలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్. తాజాగా బాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రణ్‌బీర్‌ కపూర్ తో ప్రేమలో పడిందని, ఓ యాడ్ షూటింగ్ లో వీరిద్దరూ క్లోజ్ అయ్యారని , ఆ తర్వాత ఇద్దరు కలిసి లెట్ నైట్ డిన్నర్లు కు వెళ్లడం , చెట్టపట్టా లేసుకొని తిరుగుతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే..

తాజాగా ఈ వార్తల గురించి మీడియా శృతి హాసన్ ను అడుగగా..ఆమె వాటికీ స్పదించింది..‘ఈ వార్తలు చూస్తే బాగా నవ్వుస్తాయి… ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. నేను నా వృత్తి జీవితంలో తీరికలేకుండా ఉన్నాను. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఎందుకంటే.. ఈ రూమర్స్‌ నాపై ఎలాంటి ప్రభావం చూపవు’ అని రణ్‌బీర్‌కు, తనకు మధ్య ఏమీలేదని శ్రుతిహాసన్‌ తేల్చి చెప్పింది.

ప్రస్తుతం శృతి హాసన్ తెలుగు లో పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు చిత్రం చేస్తుంది. అలాగే తన తండ్రి కమల్ హాసన్ తెరకెక్కిస్తున్న శభాష్ నాయుడు లోను ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. వీటితో పాటే త్వరలో సొంతగా ప్రొడక్షన్ హౌస్ కూడా మొదలుపెట్టబోతుందట.