ప్రొడ్యూసర్ గా కమల్ కూతురు..

sruthiఈ మధ్య కాలంలో చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ నిర్మాణ రంగం లో అడుగుపెడుతూ సక్సెస్ అందుకుంటున్నారు..తాజాగా అదే బాటలో హీరోయిన్ శృతి హాసన్ కూడా చేరాలని నిర్ణయించుకుంది.
త్వరలోనే ఫిలిం ప్రొడక్షన్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది..అయితే ఎవరితో.. ఎప్పుడు.. సినిమా తీయబోయేది ఇప్పుడు అడగొద్దని శ్రుతి వ్యాఖ్యానించింది. మంచి సినిమాలు తీయాలనే భావనతోనే నిర్మాతగా మారుతున్నట్టుగా ప్రకటించింది.

తాజాగా నాగ చైతన్య సరసన ‘ప్రేమమ్’ సినిమాలో నటించి సక్సెస్ కొట్టింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘కాటమరాయుడు’, తమిళంలో ‘సింగం 3’, తండ్రితో కలసి ‘శభాష్ నాయుడు’ చిత్రాలలో నటిస్తూ బిజీ గా ఉంది. ఇంత బిజీ టైం లో ఉంది కూడా నిర్మాణ రంగం లో అడుగుపెట్టడం ఏంటి అని కొంత మంది అంటున్నారు..మరి ఆమె ఏలాంటి సినిమా చేస్తుంది చూడాలి.