ఆ..అవకాశం రాదని రెజీనా డిసైడ్ అయ్యిందా..?

rejinaవరుస చిత్రాలతో ఫుల్ బిజీ గా ఉన్న రెజీనా ఫై ఓ వార్త ఫిలిం సర్కిల్ లో హాట్ టాపిక్ గా చక్కర్లు కొడుతుంది..త్వరలోనే రెజీనా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బై ..చెప్పబోతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ చిత్రం చేయాలనీ ఉంది అనడమే అంటున్నారు. దీనికి దానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..

సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా అవకాశాలు రానివారే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తామని ప్రకటిస్తారు అని అందరూ అనుకుంటారు..ఇప్పుడు రెజీనా కూడా ఆలా అనడం తో రెజీనా త్వరలోనే తెలుగు కు ప్యాక్ అప్ చెప్పబోతుందా అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు రెజీనా కూడా చిన్న హీరోలతో మాత్రమే చేసింది..వచ్చే అవకాశాలు కూడా చిన్న హీరోల పక్కన చాన్సులే..సినీ ఇండస్ట్రీ లో కొంతకాలం తమ హావ కొనసాగించాలంటే తప్పకుండా పెద్ద హీరో పక్కన నటించే ఛాన్స్ కొట్టేయాలి. కానీ రెజీనా కు మాత్రం ఆ అవకాశం రావడం లేదు..వస్తుందని కూడా అనిపించడం లేదు. అందుకే రెజీనా ఇలా లేడీ ఓరియంటెడ్ చిత్రం చేస్తానని ప్రకటించిందని అంటున్నారు.