వెంకీ కోసం నిత్యా ఆ పని చేస్తుందట..

nitya-janathaనిత్యా మీనన్…కేవలం తెలుగులోనే కాదు తమిళ, మళయాల భాషల్లో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న నటి..ఇటీవల జనతా గ్యారేజ్ తో సక్సెస్ అందుకున్న ఈ భామ , తాజాగా వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం తన అభిరుచి ను మార్చుకుంటుందట..

ఒకప్పుడు మీరు పొట్టిగా ఉంటారు కదా కనీసం స్లిమ్‌గా ఉండేందుకు ట్రై చేయొచ్చు కదా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తనకు వచ్చే పాత్రలు నటనను చూసి రావాలి కానీ.. ఫిజిక్ చూసి కాదని తనదైన శైలిలో బదులిచ్చింది నిత్య. తనకు నచ్చింది తింటానని.. ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెద్దగా పెట్టుకోనని కూడా ఆమె కుండబద్దలు కొట్టింది ..కానీ ఇప్పుడు మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందట..

వెంకటేష్ కోసం తాను స్లిమ్‌ గా ఉండేందుకు ట్రై చేస్తున్నాని , అంతే కాదు మీరు ఇంతవరకు చూడని నిత్యా మీనన్ ను ఈ చిత్రం లో చూస్తారంటూ ఫ్యాన్స్ కు ఆసక్తికరమైన వార్త చెప్పింది. కేవలం తన రోల్ కోసం ఇలా సన్నగా అవుతుందనే వార్తలు బయట వినిపిస్తున్నాయి. మరి ఎంతలా మారుతుందో చూడాలి మరి.