చరణ్ చేతులమీదుగా నక్షత్రం ఫస్ట్ లుక్..

nakshtram-1st-lookక్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ, ప్రస్తుతం హిట్ కోసం తహతహలాడుతున్నాడు..ఒకప్పుడు ఎన్నో అవార్డ్స్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఈయన , ఇప్పుడు మాత్రం వరుస పరాజేయాలతో సతమవుతున్నాడు..ప్రస్తుతం సందీప్ కిషన్ తో నక్షత్రం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను దసరా కానుకగా ఈ నెల 8 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేయబోతున్నాడు..అంతే కాదు ఈ ఫస్ట్ లుక్ అంటే కేవలం ఒక్క ఫోటో తోనే కాకుండా 10 లుక్స్ లలో నక్షత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. పోలీస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ కు జోడిగా రెజీనా నటించింది.