తమిళ హీరో ను లాంచ్ చేయబోతున్న దిల్ రాజ్..

remo-teluguటాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే ఎవరైనా దిల్ రాజు పేరే ముందు చెపుతారు..ఈయన ఏ సినిమా తీసిన గ్యారెంటీ హిట్ ని నమ్ముతారు..అలాంటి ప్రొడ్యూసర్ తాజాగా ఓ తమిళ హీరో ను తెలుగు లాంచ్ చేయడానికి రెడీ అయ్యాడట..ఇంతకీ ఆ హీరో ఎవరో..ఆ సినిమా ఏంటో మీరే చూడండి..

ఇటీవల తమిళం లో మంచి ప్రశంసలు అందుకున్న చిత్ర ట్రైలర్ రెమో..ఈ చిత్రం లో హీరోయిన్ గా నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తుంది…అంతే కాదు దిల్ రాజు నాని తో చేస్తున్న నేను లోకల్ చిత్రం లో కూడా కీర్తి సురేష్ నటిస్తుంది..కాగా దిల్ రాజు కు రెమో చిత్ర విశేషాలు చెప్పిందో, ఏంటో తెలియదు కానీ రెమో చిత్రాన్ని తెలుగు లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నాడట దిల్ రాజు..హీరో శివ కార్తికేయన్ ను కూడా తెలుగులో గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ అనుకుంటున్నాడట. రెమో ట్రైలర్ కూడా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో , సినిమా బాగా వచ్చిందని టాక్ రావడం తో రాజు తెలుగు లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడట. మరి రెమో ఏ రేంజి లో మన ఆడియన్స్ నచ్చుతుందో, శివకార్తికేయన్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి..