రూమర్లను కొట్టిపడేసిన రానా..

Rana-Charitraబాహుబలి చిత్రం తో భల్లాలదేవ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా , ఇటీవల తన ఫై వస్తున్న ఓ వార్త ఫై క్లారిటీ ఇచ్చాడు. కొన్ని రోజులు గా రానా మలయాళం ఎంట్రీ ఇవ్వబోతున్నాడని , అది కూడా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి ఓ భారీ చిత్రం లో నటిస్తున్నాడనే వార్త మీడియా లో చక్కర్లు కొడుతుంది.

కాగా ఈ వార్తల్లో నిజంలేదని , అవన్నీ ఎవరో కావాలని సృష్టించారు తప్ప అందులో వాస్తవం లేదని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. మోహన్ లాల్ గారితో సినిమా చేయడం పెద్ద గౌరవంగా భావిస్తానని, కానీ ఇప్పుడైతే ఆయనతో ఎలాంటి సినిమా ప్లాన్ చేయలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రానా బాహుబలి 2 చిత్రం తో పాటు , 1971 లో ఇండియా – పాక్ ల మధ్య జరిగిన సబ్ మెరైన్ వార్ నైపథ్యంలో ‘ఘాజి’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది.