‘ఇంకొక్కడు’ ఫస్ట్ డే కలెక్షన్స్ ..

inkokkadu-collectionsసినిమాల ఫలితాలు ఎలా ఉన్నకాని విక్రమ్ సినిమా వస్తుందట ఆ క్రేజ్ వేరు..ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే విక్రమ్ , తాజాగా ఇంకొక్కడు చిత్రం తో నిన్న థియేటర్స్ లలో సందడి చేసాడు..రెండు విభిన్న గెటప్స్ తో అలరించాడు.

ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ 5 కోట్ల మేర వచ్చాయని సినీ వర్గాలు చెపుతున్నారు. కాకపోతే సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోయేసరికి కాస్త కలెక్షన్స్ తగ్గాయని చెపుతున్నారు. ఇక వీకెండ్ పూర్తి అయేసరికి కలెక్షన్స్ బాగానే వస్తాయని నమ్ముతున్నారు.

ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో విక్రమ్ కు జోడిగా నయనతార , నిత్యా మీనన్ లు నటించారు