వర్మ కూడా భక్తుడు అయ్యాడా ..!

rgv-ganesh-maharajరామ్ గోపాల్ వర్మ…ఎవరికీ భయపడడు..తాను ఏది అనుకుంటే అది చేసేస్తాడు..అంతేనా ఏదో ఒక వార్త ఫై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ, ఈరోజు మాత్రం భక్తుడు గా కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు..దేవుడంటే నమ్మకం లేదు అనే వర్మ , సడెన్ గా ఈరోజు వినాయక చవితి సందర్బంగా భక్తుడిగా మారడం అందరికి షాక్ ఇచ్చింది..

వినాయ‌క విగ్ర‌హం ముందు నిలుచుని రెండు చేతులెత్తి దండం పెట్టి వెయ్యి కొబ్బ‌రికాయ‌లు, ప‌దివేల అగ‌రొత్తుల‌తో పూజ చేస్తాన‌ని, ఇక నుంచి నీకు భ‌క్తుడిగా మారుతున్నాను కాబ‌ట్టి నేను చేసిన పాపాల‌కి న‌ర‌కంలో త‌క్కువ శిక్ష‌లు ప‌డేలా రెక‌మెండ్ చేయ‌మ‌ని కోరుకున్నాడట..ఆగ్ విష‌యంలో చేసిన త‌ప్పును కూడా క్ష‌మించ‌మ‌ని కోరడం జరిగిందట..ఎందుకు ఇలా వర్మ భక్తుడి గా మారడంటే.. దేవుళ్లలో పవర్ ఫుల్ గాడ్ అంటే వినాయకుడేనట..అందుకే ఈరోజు భక్తుడిగా మారానని, తన చేసిన తప్పులను క్షేమించమని కోరడం జరిగిందని అభిమానులకు సెలవు ఇచ్చాడు..మరి వినాయకుడు వర్మ తప్పులు క్షేమిస్తాడో లేదో చూడాలి.