‘ఎమ్మార్పీఎస్‌ ధర్నా’కు కేంద్రమంత్రుల మద్దతు !

venkaiah naidu
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన ధర్నా 23వ రోజుకు చేరింది. బుధవారం ఎమ్మార్పీఎస్‌ ధర్నాకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ హాజరై సంఘీభావం తెలిపడం విశేషం. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. “జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే నష్టం లేదని, జనాభా ప్రాతిపదికన రిజర్వేసన్లు కల్పిస్తేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు”

ఆంధ్రప్రదేష్ లో చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న సమస్యల్లో ఎస్సీ వర్గీకరణ ఒకటి. ఓ వైపు ముద్రగడ కాపు రిజర్వేషన్లు అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ముద్రగడ గ్యాప్ ఇచ్చిన టైంలో ఎస్సీ వర్గీకరణపై మంద కృష్ణ మాదిగ విరుచుకు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. ఢిల్లీలో ఎమ్పార్పీస్ ధర్నాకి కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ హాజరవ్వడం ఎలా అర్థం చేసుకోవాలో తెలుగు తమ్ముళ్లకు తెలియడం లేదు. నిజంగా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు చూస్తుందా.. ? అనే అనుమానులు తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.