ఇద్దరి హీరోయిన్లను పరుగులు పెట్టిస్తున్న ఎన్టీఆర్..

jantha-new-posterఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని నందమూరి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం మరి ఎన్నో రోజులేదు. ఈ లోపు వారిని ఖుషి చేయడానికి జనతా యూనిట్ రోజుకో పోస్టర్ లేదా చిత్ర హైలైట్స్ తెలియపరుస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నారు.

తాజాగా జనతా కు సంబంధించిన న్యూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇది సాంగ్ కు సంబంధించిన స్టిల్ అని అర్ధం అవుతుంది. ఈ పిక్ లో ఎన్టీఆర్ తన సరసన నటించే ఇద్దరు ముద్దుగుమ్మలు సమంత , నిత్యా మీనన్ లను పరుగులు పెట్టిస్తున్నట్లు కనిపించాడు. ఈపోస్టర్ చూస్తుంటే సాంగ్స్ ఎంతో కలర్ ఫుల్ గా చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తుంది.

ఇక దేవి శ్రీ అందించిన రాకింగ్ మ్యూజిక్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతున్నాయి. కొరటాల దర్శకత్వం వహించగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కనిపించడం విశేషం. ఈ చిత్రం తెలుగు తో పాటు మలయాళం లో కూడా రిలీజ్ కాబోతుంది.