పవన్ ఎక్కడ ..?

pawan-hodaaఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ నుండి గల్లీ దాక కుదిపేస్తుంది. ప్రజా సంఘాలనుండి మొదలు పెడితే రాజకీయవర్గాల వరకు హోదా ఫై కాకా రేగుతుంది. ఇప్పటికే అన్ని పార్టీల కార్య కర్తలు రోడ్ ఎక్కి ప్రత్యేక హోదా మా నినాదం అంటున్నారు. కానీ బిజెపి మాత్రం ఇంతవరకు హోదా కు సంబదించిన అంశం ఫై నోరు మెదపడం లేదు.

మొదట్లో ఏపీ ప్రత్యేక హోదా కోసం దూకుడు చూపించిన జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ కనుచూపుమేర కూడా కనిపించడంలేదు. ఒకప్పుడు ఇదే అంశం ఫై కేంద్రం ఫై బుల్లెట్లు పేల్చినా ఆరడుగుల బులెట్ ఇప్పుడు తుపాకీ కూడా దొరకడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వక పోతే చూస్తూ కూర్చుదో అన్న జనసేన ప్రస్తుతం నోరు మెదపకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతుంది. అసలు పవన్ కళ్యాణ్ ఇంత సైలెంట్ గా ఉండడం వెనుక కారణం ఏంటో తెలియక అయన అభిమానులతో పాటు పార్టీ అబ్యర్దులు నిర్వేరాబోతున్నారు.

మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ లో ఊరు , వాడ ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల వారు ఆందోళనలతో హోరెత్తేస్తున్నారు. చివరకు అధికారం లో ఉన్న టీడీపీ సైతం వినూత్నంగా నిరసనలు తెలుపుతుంది. కానీ జనసేన కు సంబంధించిన ఒక్కరు అంటే ఒక్కరు కూడా రోడ్ ఫైకి రాకపోవడం ఏపీ లో చర్చ గా మారింది . వాస్తవానికి పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి సమాచారం రాకపోయేసరికి కార్యకర్తలు ఆందోళనలు చేయాలా వద్ద అనే అయోమయం లో పడ్డారు.

2014 ఎన్నికల్లో బీజేపీ , టీడీపీ పార్టీలకు మద్దతు పలికిన జనసేన ఇప్పుడు వారిని ఏం అనలేని పరిస్థితి లో పడ్డాడు అనే వాదనలు వినపడుతున్నాయి. త్వరలోనే పవన్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవబోతున్నాడని అందుకే సైలెంట్ గా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంత వరకు జనసేన నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మొత్తమీద ప్రశ్నించేందుకే పార్టీ పెట్టిన పవన్ ,ఎప్పుడు ప్రశ్నగానే మిగిలిపోతున్నాడని జనాలు అంటున్నారు.