కబాలి పరిస్థితి ఏంటి..చెప్పను బ్రదర్

kabli-overall-talk2మొన్న , నిన్న, ఈరోజు ఉదయం వరకు ఎక్కడ చూసిన ఎక్కడ విన్న కబాలి మేనియానే కనిపించింది, వినిపించింది. కానీ ఉదయం ఆట తో మేనియా మలుపు తీరిగింది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే మిగిల్చింది. రజని నటన సూపర్బ్ గా ఉన్న కథ లో సరైన దమ్ము లేకపోవడం తో అభిమానులు సైతం గొప్పగా చెప్పలేకపోతున్నారు. విడుదల కు ముందు ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని భావించిన వారంతా ఇలా అయ్యిందేంటి అని ఫీల్ అవుతున్నారు. అంతే కాదు సినిమా ఎలా ఉంది అని ఎవరైనా అడిగిన కానీ ‘చెప్పను బ్రదర్ ‘ అనే సమాధానం చెపుతున్నారు.