తెలుగు ప్రేక్షకులకు ‘కబాలి ‘ నిరాశనే మిగిలిస్తుంది.

kabali-release-dateకొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కబాలి మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళనాట ప్పటికే వారం పాటు టికెట్స్ బుక్ అవడం తో థియేటర్ల యాజమాన్యం ఫుల్ ఖుషి గా ఉన్నారు. అంతే కాక అభిమానుల కోసం తమిళనాట గురువారం అర్థరాత్రి నుంచే స్పెషల్ షోస్ వేయనున్నడం తో తమిళ రజని ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.

కానీ తెలుగు ఫ్యాన్స్ మాత్రం బాధపడుతున్నారు. ఎందుకంటే తెలుగులో మాత్రం శుక్రవారం రోజునే మొదటి షో ప్రదర్శితం కానుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్ర బెనిఫిట్ షో లేకపోవడం కాస్త నిరాశ చెందుతున్నారు తెలుగు ఆడియన్స్.

దాదాపు ఆరు వందలకు పైగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక్క తెలంగాణలోనే నాల్గు వందలకు పైగా థియేటర్లు లలో రిలీజ్ చేస్తున్నారు అభిషేక్ పిక్చర్స్ వారు. ఇన్ని థియేటర్లలో రిలీజ్ అవుతూ , బెనిఫిట్ షో లేకపోవడం బాదే కదా మరి. పా రంజిత్ దర్శకత్వం వహించగా , కళైపులి థాను నిర్మాత.