కబాలి చిత్రాన్ని చూసిన మొట్ట మొదటి వ్యక్తి ఇమె.

kaabali-movie-firstకబాలి..కబాలి..కబాలి ఇప్పుడు ఎక్కడ విన్న , ఎక్కడ చూసిన ఇదే నామస్మరణా. ఏ సినిమాకు రానంత క్రేజ్ ఈ చిత్రానికి వచ్చింది. బిజినెస్ పరంగానే కాకుండా ప్రమోషన్స్ పరంగా కూడా కబాలి అంచనాలు రెట్టింపు చేసింది..ఇక ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అభిమానులు వెయ్యి కళ్ల తో ఎదురుచూస్తున్నారు.

అంతకంటే ముందే ఈ చిత్రాన్ని ఓ వ్యక్తి చూసారని చిత్ర యూనిట్ చెపుతున్నారు..వారే రజని కూతురు సౌందర్య. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన సౌందర్య సినిమా ఓ రేంజ్ లో ఉందని , నాన్నగారి నటన గురించి ఎంత చెప్పిన తక్కువే అని చెప్పుకొచ్చిందట. దీంతో సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందనే అంచనాలు వేయడం మొదలు పెట్టారు అభిమానులు. మరో పక్క చిత్ర నిర్మాత 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడుతుంది.