కుక్క అంటే విశ్వాసానికి మారుపేరు అనుకుంటాం..కానీ అన్నం పెట్టిన యజమానిని చంపేసింది ఆ కుక్క..ఆ వివరాలు ఏంటో మీరే చూడండి..
తమిళనాడు వేలూరులో ప్రాంతం లో ఈ ఘటన చోటుచేసుకుంది..గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న కృపాకరం, రాట్ వీలర్ జాతికి చెందిన ఆడ కుక్కను కొంతకాలంగా పెంచుకుంటున్నాడు. వేలూరుకు సమీపంలోనే అతనికి ఓ మామిడి తోట ఉంది. ఆ తోటలో కుక్కను కాపలాగా పెట్టి రోజు అక్కడికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆ కుక్క క్రాసింగ్ కోసం అదే జాతికి చెందిన మరో మగ కుక్కను తీసుకొచ్చాడు. వీటిని పొలం దగ్గరే కట్టేసి వాటికి ఆహారం పెట్టేవాడు. అదే క్రమంలో మంగళవారం కూడా వాటికి ఆహారం పెట్టేందుకు వెళ్లగా రెండు కుక్కలు కలిసి యజమానిపై దాడిచేశాయి.
ఇతడి అరుపులు విని చుట్టుపక్కల వారు వచ్చి హాస్పటల్ లో జాయిన్ చేశారు..అప్పటికే అతడి శరీరం అంత రక్తం తో నిండిపోయింది..దాడి ఎక్కువగా జరగడం తో కొంత సేపటికే అతడి ప్రాణాలు పోయాయి…