పబ్లిక్‌ టాయిలెట్లతో ‘కబాలి ‘ టికెట్స్ ఫ్రీ….

kabali-public-toiletప్రపంచ వ్యాప్తంగా కబాలి హవా మొదలయ్యింది..కేవలం నెల మీదనే కాదు ఆకాశంలో కూడా కబాలి జెండా ఊపుతున్నాడు..ఇంకా విడుదల తేదీని ప్రకటించని లేదు కానీ అప్పుడే మీడియా లో టికెట్స్ పై చర్చ మొదలయ్యింది..కేవలం సినీ అభిమానులే కాదు రాజకీయ నాయకులు సైతం కబాలి ని క్యాష్ చేసుకుంటున్నారు..

తాజాగా పుదుచ్చేరి గవర్నర్‌ గా నియమింపబడిన కిరణ్‌ బేడీ ఓ మాస్టర్ ప్లాన్ తో జనాలను ఆకర్షిస్తుంది.. పుదుచ్చేరిలో బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు కబాలి తో లింక్ పెట్టింది.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ టాయిలెట్లను ఉపయోగించిన వారికి కబాలి టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది..కానీ టాయిలెట్ కి వెళ్లిన ప్రతి ఒక్కరికి కబాలి టికెట్ ఇవ్వరు.వెళ్లిన వారితో ఓ లిస్టుని తయారు చేసి.. అందులో నుంచి కొందరిని డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి.. కబాలి టికెట్లను అందజేస్తారట..దీంతో ఒక్క టిక్కెట్ అయిన తమకు దక్కకపోద్దా అని ఆశగా ప్రజలు పబ్లిక్‌ టాయిలెట్ల వైపు పరుగులు తీస్తున్నారట జనాలు..