బాహుబలి 2 క్లైమాక్స్ వీడియో బయటకు వచ్చింది…

bahubali-climaxతెలుగు సినిమా చరిత్రను బాహుబలి చిత్రం తో ప్రపంచ వ్యాప్తంగా సాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి..ఎన్నో రికార్డ్స్, అవార్డ్స్ సాదించిన ఈ చిత్రం , ఇప్పుడు సీక్వెల్ రూపొందించే పనిలో చిత్ర యూనిట్ బిజీ అయ్యారు..తాజాగా బాహుబలి 2 కు సంబదించిన క్లైమాక్స్ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కష్టపడుతున్నారు..

సీక్వెల్ కోసం భారీ సెట్స్ , విగ్రహాల నిర్మాణం చేస్తున్నారు..అలాగే ఫస్ట్ పార్ట్ లో భారీ స్థాయి లో ఉన్న భళ్లాలదేవ విగ్రహాన్ని చూపించిన రాజమౌళి , సెకండ్ పార్ట్ లో దానికి తలదన్నే రీతిలో బాహుబలి విగ్రహాన్ని రెడీ చేస్తున్నాడు..అలాగే చిత్ర నటి నటులు ప్రభాస్, అనుష్క, రానా తమ పాత్రలకు రిహార్సల్స్ చేస్తున్నారు. అలాగే తమన్నా హార్స్ రైడింగ్ , కత్తి యుద్ధంలో శిక్షణ పొందుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో 70 రోజులు జరగబోతుంది. దీనికి సంబదించిన ఓ వీడియో నెట్ లో బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది..ఈ వీడియో చూస్తే చిత్ర యూనిట్ ఎంత కష్టపడుతున్నారో అర్ధం అవుతుంది..ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి.