చాల ఏళ్ల తర్వాత పవన్ ధియేటర్ కు వెళ్లి సినిమా చూసాడట…

pawan-folow-ajithపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలు ఏంటో, తన పుస్తకాలు ఏంటో తప్ప వేరే సినిమాల గురించి పట్టించుకోడు..అలాంటిది తన ప్రాణ స్నేహితుడు , అలాగే తన వీరాభిమాని కాంబినేషన్ లో వచ్చిన ‘అ..ఆ ‘ చిత్రాన్ని చూడడం జరిగిందట..అంతే కాదు సినిమా చూసిన తర్వాత ప్రత్యేకంగా రావు రమేష్ కు , అలాగే హీరో నితిన్ , డైరెక్టర్ త్రివిక్రమ్ లకు కాల్ చేసి విష్ చేయడం జరిగిందట..

ముఖ్యంగా రావు రమేష్ చెప్పిన డైలాగులు పవన్‌ కళ్యాణ్ కు ఎంతగానో నచ్చాయని సమాచారం. వీలుంటే మరోసారి ఈ సినిమాను చూస్తానని పవన్ తెలిపాడట. ఇటీవలే సింగపూర్ నుండి వచ్చిన పవన్ , జూన్ సెకండ్ వీక్ నుండి తన నూతన చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు ..